హలో సర్,
నేను EOL అప్లై చేసినప్పుడు(14-06-2023) కమీషనర్ గారు ఫైల్ పుట్ అప్ కి approve చేసారు. e-office లో ఫైల్ రన్ చేస్తారు మీరు వెళ్ళండి అని చెప్పారు. నేను EOL ఫై వెళ్ళిపోయాను. నేను వెళ్ళిన కొన్ని నెలలకి e-office లో ఫైల్ రన్ చేస్తారు అని చెప్పిన మేడం అనారోగ్యం కారణం తో మరణించారు. e-office లో EOL ఫైల్ రన్ చేయలేదు.
నేను 10 నెలల EOL(30-06-2023 to 30-04-2024) మరియు 3 నెలల మెడికల్ లీవ్(01-05-2024 to 31-07-2024) తరువాత సర్వీస్ లో జాయిన్(01-08-2024) అయ్యాను.
నా తోటి ఉద్యోగులకి 2 Annual ఇంక్రిమెంట్ లు జరిగాయి. నాకు ఒక్క ఇంక్రిమెంట్ కూడా ఆడ్ అవలేదు. కనుక్కుంటే e-office లో EOL approve అయిన తరువాత నా SR లో EOL ఎంట్రీ చేసిన తర్వాత మాత్రమే ఇంక్రిమెంట్ కి పెడతాము అంటున్నారు.
జాయిన్(01-08-2024) అయిన రోజు నుండి e-office లో ఫైల్ రన్ చేయమని ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాను. ఇప్పటివరకు ఫైల్ రన్ చేయలేదు.
నాకు ఇంక్రిమెంట్ ఆడ్ అవ్వటానికి వేరే ఇతర మార్గము ఏమి లేదా ? దయచేసి తెలుపగలరు.