Namasthey sir
Oka employee nenu chesthanu oppukokunna pakka Panchayat ki incharge ga vese adhikram higher authorities ki undha
Malli work sariga avva ledhu ani ma medha ne disciplinary action antunnaru
ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు ఒక ఉద్యోగి గ్రహించవల్సిన ముఖ్యమైన అంశం “ఏ ఉద్యోగి అయినా సరే సుపీరియర్ ఆర్డర్స్ నీ నిరాకరించడం అనేది ప్రవర్తన నియమావళి నీ ఉల్లంఘించినట్లు పరిగణించ బడుతుంది”.
ఒక ఉద్యోగి ఇష్టాన్ని అడిగి ఇష్టం అయితే ఇన్చార్జి లు ఇవ్వడం, ఇష్టం లేకపోతే మానేయడం అనేది జరగదు. ఈ సందర్భంలో ఉద్యోగి విల్లింగ్ తో పని లేదు. అలా అడగవలసిన అవసరం లేదు. సంబంధిత అధికారులు పరిపాలనా సౌలభ్యం మరియు ఇతర అంశాలను దృష్టిలో ఉంచుకుని ఎవరికీ ఇన్చార్జి ఇవ్వాలి అని నిర్ణయించుకుని ఆదేశాలు జారీ చేస్తారు. ఈ విషయం లో వారికి సంపూర్ణ అధికారాలు ఉంటాయి.
అలా జారీ చేసిన ఆదేశాలను తిరస్కరించడం అనేది ఉద్యోగుల ప్రవర్తనా ఉల్లంఘన గా పరిగణించ బడుతుంది.
అదే విధంగా ఇన్చార్జి విధులు అని అలక్ష్యం చేయడానికి లేదు. ఇన్చార్జి పోస్టులో జరిగే తప్పిదాలకు కూడా తప్పనిసరిగా బాధ్యత వహించాల్సి ఉంటుంది.
ఇన్చార్జి లు చేయాల్సి రావడం అనేది ప్రతీ ఉద్యోగి సర్వీస్ లో ఒక సర్వసాధారణమైన భాగం. ఉన్న పోస్టులో వారి రిటైర్ కావడం, రిజైన్ చేయడం, బదిలీ పై వేరే చోటకు వెళ్ళడం, ట్రైనింగ్, ఫారిన్ సర్వీస్, సెలవులు, సస్పెన్షన్ ల వంటి అనేక కారణాల వల్ల కొన్ని పోస్టులు ఖాళీగా ఉండే పరిస్థితులు ఏర్పడతాయి. అలా ఖాళీ గా ఉండే పోస్టులకు తప్పనిసరిగా ఇన్చార్జి గా ఎవరో ఒకరిని నియమిస్తారు.