Is there chance to change one department to another department
Service Rules ప్రకారం ఒక శాఖలో ఉద్యోగి మరో శాఖకు మారడానికి అవకాశం ఉండదు. అయితే రెండు వేర్వేరు శాఖల లో ఒకే తరహా పోస్టులు ఉన్నట్లయితే ప్రభుత్వ ప్రత్యేక అనుమతి తో మారడానికి అవకాశం అయితే ఉంది.
దాని కొరకు ప్రభుత్వానికి బదిలీ కోరు ఉద్యోగి దరఖాస్తు చేసుకోవాలి. అతని దరఖాస్తు రెండు శాఖలకు చెందిన నియామక అధికారులు, శాఖాధిపతులు, సెక్రెటరీ లు ఎలాంటి అభ్యంతరాలు లేకుండా అంగీకరిస్తే ఆ ఫైల్ ఫైనాన్స్, GAD ద్వారా ముఖ్యమంత్రి గారి ఆమోదానికి వెళ్తుంది. ముఖ్యమంత్రి గారి ఆమోదం అయితే శాఖ మార్పునకు అనుమతి ఇస్తూ జివో జారీ అవుతుంది.
ఇలా శాఖ మారిన సందర్భంలో అతని సీనియారిటీ వదులుకుని, కొత్త శాఖలో అందరి కన్నా జూనియర్ గా ఉండటానికి అంగీకరిస్తూ డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది