ఎపి మినిస్టర్స్ సర్వీస్ రూల్స్ కు ఏపీ subordinate సబార్డినేట్ సర్వీస్ రూల్స్ కు తేడా ఏమిటి?
- ఎపి మినిస్టర్స్ సర్వీస్ రూల్స్ లో ఎ ఉద్యోగులు వస్తారు.
- ఎపి సబార్డినట్ సర్వీస్ రూల్స్ లో ఎ ఉద్యోగులు వస్తారు
ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ అండ్ సబర్డినేటు సర్వీసు రూల్స్ అనేవి అన్నీ సర్వీస్ రూల్స్ కు మాతృక వంటివి. ఏ సర్వీస్ రూల్స్ అయినా ఈ నిబంధనలకు లోబడే ఉంటాయి.
ఈ నిబంధనలకు లోబడి వివిధ శాఖలు, వివిధ పోస్టులకు సంబంధించి అదనపు రూల్స్ జోడిస్తూ అంటే ఆ పోస్టుకు నియామక అధికారి ఎవరు, ఆ పోస్టు నియామక పరిధి ఏమిటి? ఆ పోస్టుకు కావాల్సిన విద్యార్హతలు ఏమిటి? నియామక విధానం ఏమిటి? నియామక అధికారి ఎవరు? పాస్ కావాల్సిన డిపార్టుమెంటు టెస్టులు, పొందవలసిన ట్రైనింగ్ లు వంటివి ఆయా శాఖల సర్వీస్ రూల్స్ లో ఉంటాయి.
ఇక మినిస్టీరియల్ రూల్స్ అంటే మినిస్టీరియల్ తరహా విధులు అంటే ప్రధానంగా ఫైల్స్ లో పని చేసేవారు, అడ్మినిస్ట్రేషన్ విభాగం లో ఉండే జూనియర్ అసిస్టంట్, సీనియర్ అసిస్టెంట్, పరిపాలనాధికారి లేక పర్యవేక్షకులు, టైపిస్ట్ లు, స్టెనో లు మొదలైన వారికి చెందిన సర్వీస్ రూల్స్.