అయ్యా!
ప్రమోషన్ కొరకు కిందిస్థాయి నుండి పై స్థాయి అధికారం కొరకు ఆరు పోస్టులు మాత్రమే ఉంటే దానిని ఎలా రోస్టర్ పాయింట్ ప్రకారం సర్దుబాటు చేస్తారు తెలియజేయగలరు
ఐదు పోస్టుల కంటే మించి ఉన్నప్పుడు పదోన్నతుల్లో రిజర్వేషన్ అమలు అయి రోస్టర్ పాయింట్లు పరిగణన లోకి తీసుకుని అమలు చేస్తారు.
ఇప్పుడే రోస్టర్ మొదలయింది అనుకుంటే, రెండు ఖాళీలు ఉంటే రోస్టర్ 1 ప్రకారం సీనియారిటీ లో మొదట ఉన్న వారికి పదోన్నతి ఇస్తారు. రోస్టర్ 2 SC కు చెందినది. Sc లలో అడక్వసీ ఉంటే ఆ పాయింట్ కూడా సీనియారిటీ ప్రకారం రెండవ వారికి ఇస్తారు. లేకపోతే సీనియారిటీ లో మొదట ఉన్న అర్హులైన ఎస్సి కి ఇస్తారు.
మరి కొన్ని రోజులకు మరో 3 పోస్టులు ఖాళీ అయితే పై విధంగానే 3, 4, 5 రోస్టర్ పాయింట్లు భర్తీ చేస్తారు. అలా ఖాళీ అయినప్పుడల్లా ఇదే విధానం లో 6, 7, 8 ….. ఇలా భర్తీ చేసుకుంటూ వెళ్తారు.